Time Keepers Watch Boutique: పాన్‌కార్డు దుర్వినియోగంపై అనిల్ కుంబ్లే భార్య ఫిర్యాదు!

  • కుంబ్లే భార్య పాన్ కార్డుతో రూ.33 లక్షల విలువైన రెండు వాచీల విక్రయం
  • ఆదాయపు పన్ను వివరాలు పరిశీలిస్తుండగా మోసం వెలుగులోకి
  • బెంగళూరులోని కబన్ పార్క్ పోలీసులకు ఫిర్యాదు

టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే భార్య చేతన తన పాన్ కార్డు దుర్వినియోగమైందంటూ బెంగళూరులోని కబన్ పార్క్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన పాన్ కార్డును ఉపయోగించి మోసగాళ్లు దాదాపు రూ.33 లక్షల విలువైన రెండు వాచీలను విక్రయించారని ఆమె ఆరోపించారు. ఫ్రాంక్ ముల్లర్ వాచీని కొనుగోలు చేయడానికి జులై, 2016లో ఆమె బెంగళూరులోని యూబీ సిటీలో ఉన్న జిమ్సన్ టైమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి వెళ్లారు. అయితే ఆ వాచీ ప్రస్తుతానికి స్టాకు లేదని, ముంబైలోని టైమ్ కీపర్స్ వాచ్ బొటిక్ నుంచి తెప్పిస్తామని స్టోర్‌లో పనిచేసే సత్య వాగీశ్వర్ ఆమెకు చెప్పాడు.

కొన్ని రోజుల తర్వాత వారు ముంబై నుంచి ఆ వాచీని తెప్పించారు. అది చేతనకు బాగా నచ్చింది. దాంతో రూ.8 లక్షల చెక్కును టైమ్ కీపర్స్ వాచ్ బొటిక్ పేరుపై ఆమె జారీ చేశారు. దానితో పాటు ఆమె తన పాన్ కార్డు వివరాలను కూడా సమర్పించారు. అయితే ఇటీవల ఆమె తన ఆదాయపు పన్ను వివరాలను పరిశీలిస్తుండగా తన పాన్ కార్డు దుర్వినియోగమైందన్న విషయాన్ని ఆమె గుర్తించారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. టైమ్ కీపర్స్ వాచ్ బొటిక్‌పై వారు ఐపీసీలోని 406, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News