Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • రామ్ తో మరోసారి జత కట్టనున్న కాజల్ 
  • షూటింగుకి రెడీ అవుతున్న చరణ్ 
  • 'రాజుగారి గది'కి మూడో పార్ట్  

*  ఎనర్జిటిక్ హీరో రామ్ సరసన కాజల్ అగర్వాల్ మరోసారి జత కట్టనుంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో స్రవంతి రవికిషోర్ నిర్మించే చిత్రంలో రామ్ సరసన నాయికగా కాజల్ ను ఎంచుకున్నట్టు తాజా సమాచారం.
*  'రంగస్థలం' చిత్రంతో మంచి హిట్టును తన ఖాతాలో వేసుకున్న మెగా హీరో రామ్ చరణ్ తన తదుపరి చిత్రం షూటింగుకి రెడీ అవుతున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ రెండో షెడ్యూలు షూటింగ్ ఈ నెల 10 నుంచి జరుగుతుంది. ఈ షెడ్యూలులో చరణ్ పాల్గొంటాడు. ఇందులో కైరా అద్వానీ కథానాయికగా నటిస్తోంది.  
*  నాగార్జున, సమంతలతో 'రాజుగారి గది 2' చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు ఓంకార్ ఈ చిత్రానికి మూడో పార్టును కూడా తీయనున్నట్టు ప్రకటించాడు. 'రాజుగారి గది 3' చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు పనులు ప్రస్తుతం జరుగుతున్నాయని ఆయన చెప్పారు.

More Telugu News