Australia: ఆసీస్ ఆటగాళ్లు ఎందుకలా ఏడుస్తున్నారన్న శ్రీలంక మాజీ ఆటగాడు.. నీ కామెంటరీ భరించలేకేనన్న నెటిజన్లు!

  • వైరల్ అయిన రసెల్ ఆర్నాల్డ్ ట్వీట్
  • రకరకాల కామెంట్లతో హోరెత్తిస్తున్న ట్విట్టర్ యూజర్లు
  • ఆర్నాల్డ్‌కు చురకలు

బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి నిషేధానికి గురైన ఆస్ట్రేలియా ఆటగాళ్లు మీడియా సమావేశాల్లో కన్నీళ్లు పెట్టుకుంటుండడాన్ని శ్రీలంక మాజీ ఆటగాడు రాసెల్ ఆర్నాల్డ్ ఆక్షేపించాడు. ‘‘ఎందుకు వీరంతా ఏడుస్తున్నారు?’’ అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై నెటిజన్లు స్పందించడంతో అది వైరల్ అయింది.

నీ కామెంటరీ భరించలేకే వారంతా ఏడుస్తున్నారని కొందరు కామెంట్ చేయగా, వారు ఆడుతున్నది దేశం కోసం కాబట్టే ఏడ్చారని మరికొందరు కామెంట్ చేశారు. స్మిత్, బాన్‌క్రాఫ్ట్ ఏడ్చినప్పుడు చలించిపోయిన అభిమానులు వార్నర్ ఏడిస్తే ఎందుకు సానుభూతి ప్రకటించడం లేదో? అని మరొకరు ట్వీటారు. వాళ్లంతా వారి కుటుంబాలను తలచుకుని ఏడ్చారని, నీకు ఆ భాగ్యం లేదని ఇంకొకరు ఘాటుగా బదులిచ్చారు. 'ఆర్నాల్డ్ బాగా చెప్పావు' అని కొందరు అన్నారు. 'బహుశా నీ ట్వీట్ వల్లే కావచ్చు' అని ఇంకొకరు, 'ఇదే ప్రశ్నను నిన్ను అడగొచ్చా?' అని మరొకరు.. ఇలా రకరకాల కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

బాల్ ట్యాంపరింగ్ వ్యవహారంలో దోషులుగా తేలిన డేవిడ్ వార్నర్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, స్టీవ్ స్మిత్‌లు మీడియా సమావేశాల్లో కన్నీటి పర్యంతమయ్యారు. చేసిన తప్పుకు క్షమాపణలు వేడుకున్నారు.

More Telugu News