teacher: డ్యాన్స్‌ చేస్తూ పాఠాలు చెబుతోన్న టీచర్‌.. వీడియో వైరల్!

  • సాంఘిక శాస్త్రం, హిందీ బోధించే రోహిత్
  • 'అభినయ్ గీత్' ప్రక్రియ ద్వారా బోధన 
  • విద్యార్థులను ఆకట్టుకుంటున్న వైనం 

గుజరాత్‌లోని బనస్కంతా జిల్లా అర్నివాడా గ్రామంలో ఓ ఉపాధ్యాయుడు వినూత్న రీతిలో విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. సాంఘిక శాస్త్రం, హిందీ వంటి సబ్జెక్టుల పాఠాలంటే పిల్లలు సాధారణంగా కాస్త బోరుగా ఫీలవుతారు. విద్యార్థుల్లో అటువంటి భావం కలగకుండా ఉపాధ్యాయుడు రోహిత్ పటేల్ (27) ఇలా డ్యాన్స్ చేస్తూ పాఠాలు చెబుతున్నారు.

ఇలా పిల్లలకు బోరు కలగకుండా బోధన చేసే పక్రియను 'అభినయ్ గీత్' అంటారని, మనం చెప్పదలచుకున్న విషయం విద్యార్థులకు సులభంగా అర్థమవుతుందని సదరు ఉపాధ్యాయుడు చెప్పారు. ఆ పాఠశాలలో అప్పట్లో 14 మంది ఉన్న విద్యార్థుల సంఖ్య.. రోహిత్ అనుసరిస్తోన్న ఈ విధానం వల్ల ఇప్పుడు 69కి చేరిందట. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పుడు న్యూస్‌ ఛానెళ్లలోనూ ప్రసారం చేస్తున్నారు. మీరూ చూడండి.. 

More Telugu News