Will meets Sophia: రోబో సోఫియాతో డేటింగ్ కు వెళ్లిన హాలీవుడ్ హీరో విల్ స్మిత్

  • సోఫియాతో డేటింగ్‌ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన స్మిత్‌
  • విల్ స్మిత్ ను నిరాశపరిచిన సోఫియా
  • సోఫియాను తయారు చేసిన హాన్ సన్ రోబోటిక్స్ సంస్థ

హాంకాంగ్‌కు చెందిన హాన్‌ సన్‌ రోబోటిక్స్‌ సంస్థ తయారు చేసిన హ్యుమనాయిడ్ రోబో సోఫియాతో హాలీవుడ్ హీరో విల్ స్మిత్ డేటింగ్ కు వెళ్లాడు. అయితే, సోఫియాను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాడు. ఈ డేటింగ్ కు సంబంధించిన 4.30 నిమిషాల నిడివిగల వీడియో ఒకటి షోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మనుషుల హావభావాలను తెలుసుకుని మసలుకునేలా అభివృద్ధి చేసిన సోఫియా, విల్ స్మిత్ మధ్య సరదా సంభాషణ చోటుచేసుకుంది...

ఈ సందర్భంగా సోఫియాకి వైన్ ఆఫర్ చేస్తే సున్నితంగా తిరస్కరించింది. అలాగే జోక్ చెబుతానంటే, తనకు హాస్యం నచ్చదని చెప్పింది. తనకు ఎలక్ట్రానిక్‌ మ్యూజిక్‌ అంటే ఇష్టమనీ, హిప్‌-హాప్‌ మ్యూజిక్‌ కూడా వింటుంటానని చెప్పింది. చివర్లో స్మిత్ కి సోఫియా చిన్న ఝలక్ కూడా ఇచ్చింది. 'నిన్ను ముద్దు పెట్టుకుంటా'నని స్మిత్ చెప్పగా, అందుకు 'నో' చెబుతూ, తనని కేవలం స్నేహితుడిగానే భావిస్తున్నానని చెప్పింది. వారి సంభాషణ మీరూ వినచ్చు.  
 .   

More Telugu News