manikarnika: మరోసారి కత్తిదూస్తున్న సోనూసూద్... మణికర్ణిక కోసం సాహసాలు

  • గుర్రపు స్వారీ విన్యాసం
  • ఇతర ఆయుధాలతో పోరాట దృశ్యాల కోసం సాధన
  • వచ్చే వారం నుంచి మొదలయ్యే షెడ్యూల్ కోసం సన్నద్ధం

ప్రముఖ నటుడు, పలు తెలుగు సినిమాల్లో ప్రతి నాయకుని పాత్రలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సోనూసూద్ బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న 'మణికర్ణిక' చిత్రంలోనూ తన సత్తా చూపిస్తున్నాడు. రాణి ఝాన్సీ లక్ష్మీ భాయి జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్న ఈ సినిమాలో ఆ పాత్రను కంగనా రనౌత్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం సోనూసూద్ ఇప్పుడు సాహస విన్యాసాల కోసం కసరత్తు చేస్తున్నాడు.

ఝాన్సీ లక్ష్మీ భాయి అంటేనే సాహసనారి అని తెలిసిందే. రాజుల కాలం నాటి కథ కావడంతో ఈ సినిమాలో గుర్రాలపై స్వారీ, కత్తులతో యుద్ధాలు సహజంగానే కనిపించనున్నాయి. దీంతో సోనూసూద్ గుర్రపు స్వారీ చేస్తూ సాహస సీన్ల కోసం సాధన చేస్తున్నాడు. గతంలో వచ్చిన జోదా అక్బర్, కుంగ్ఫూ యోగా చిత్రాల్లో గుర్రాలపై స్వారీ చేసే సీన్లలో నటించాడు. ఆ అనుభవంతో ఇప్పుడు సాధన సులభమైంది. గుర్రాన్ని దౌడు తీయిస్తూనే కత్తిదూయడం, కత్తితో శత్రువులతో తలపడడం, ఈటలు వదలడం వంటి సీన్లు ఈ సినిమాలో దర్శనమివ్వనున్నాయి. వచ్చే వారంలో ఈ సినిమా తదుపరి షెడ్యూల్ మొదలు కానుండడంతో అందుకోసం సోనూసూద్ విరామం లేకుండా సాధన చేస్తున్నాడు.

More Telugu News