Sridevi: సీఎం చెప్పారనే ప్రభుత్వ లాంఛనాలతో నటి శ్రీదేవి అంత్యక్రియలు!

  • ఆర్టీఐ చట్టం కింద బయటపెట్టిన ప్రభుత్వం
  • ప్రభుత్వ లాంఛనాలతో జరిపించాలంటూ సీఎం నుంచి మౌఖిక ఆదేశాలు
  • గత ఆరేళ్లలో మొత్తం 41 మందికి గౌరవం

బాలీవుడ్ నటి శ్రీదేవికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆర్టీఐ చట్టం కింద ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. శ్రీదేవి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలంటూ ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు రావడంతో ఆ విధంగా నిర్వహించినట్టు మహారాష్ట్ర సాధారణ పరిపాలన విభాగం తెలిపింది.

అనిల్ గల్గాలీ అనే కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు పై విధంగా సమాధానం ఇచ్చింది. గత ఆరేళ్లలో మొత్తం 41 మందికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించినట్టు పేర్కొంది. ఫిబ్రవరి 25న శ్రీదేవి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో చేపట్టాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చాయని సమాధానంలో పేర్కొంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ముంబై సబర్బన్ కలెక్టర్, పోలీసు కమిషనర్లకు సూచనలు అందాయని పరిపాలన విభాగం సమాధానంలో పేర్కొంది.

More Telugu News