pat cummins: ఆసీస్ జట్టులోని మరో ఆటగాడు కూడా బాల్ టాంపరింగ్ చేశాడా?

  • మూడో టెస్టులో బంతి రూపు మార్చే ప్రయత్నం చేసిన కమ్మిన్స్
  • బంతిని షూతో అడ్డుకుని, స్పైక్ తో ఒత్తే ప్రయత్నం
  • వీడియోలో రికార్డయిన దృశ్యాలు 

సఫారీలతో జరిగిన మూడో టెస్టులో గెలిచేందుకు అనైతిక పద్ధతులు ఉపయోగించిన ఆసీస్ ఆటగాళ్లు, స్మిత్, వార్నర్, బాన్ క్రాఫ్ట్ లపై బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ వివాదం ఇంకా చల్లారకముందే అదే టెస్టులో మరో ఆటగాడు పాట్ కమ్మిన్స్ కూడా బాల్‌ టాంపరింగ్‌ కు పాల్పడ్డాడన్న వీడియో వివాదాస్పందంగా మారింది.

దాని వివరాల్లోకి వెళ్తే.. తొలిరోజు ఆట 53వ ఓవర్‌ లో ప్రొటీస్‌ ఆటగాడు డీన్‌ ఎల్గర్‌ కు కమ్మిన్స్ బంతిని సంధించగా, దానిని అతను డిఫెన్స్‌ ఆడాడు. దీంతో అది మళ్లీ నేరుగా కమ్మిన్స్ వద్దకే వెళ్లింది. దానిని తన షూతో ఆపి, షూ స్పైక్ తో కొన్ని సెకెన్లపాటు బంతిని బలంగా ఒత్తి దాని రూపు మార్చే ప్రయత్నం చేశాడు కమ్మిన్స్. ఇదంతా వీడియోలో రికార్డయింది.

దీనిని అప్పుడు ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. అంపైర్లు కూడా బంతిని పరిశీలించి ఆటను కొనసాగించారు. అయితే కామెంటేటర్‌ గ్రేమ్‌ స్మిత్‌ మాత్రం ‘ఉద్దేశపూర్వకంగా.. అనుకోకుండా చేసింది’ అంటూ ఆ చర్యను ఎద్దేవా చేశాడు. మరుసటి రోజు ప్రెస్ మీట్ లో దానిపై స్పందించిన కమ్మిన్స్ ‘బంతిని ఉద్దేశపూర్వకంగా తొక్కలేదు. ఆ వెంటనే నేను అంపైర్‌ ఇల్లింగ్‌ వర్త్‌ ను చూశాను. ఆయన చిన్నగా నవ్వారు’ అని పేర్కొన్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More Telugu News