siddaramaiah: ప్లేస్టోర్ నుంచి మాయమైన సిద్ధరామయ్య యాప్

  • యాప్స్ నుంచి విదేశాలకు వెళ్తున్న సమాచారం
  • ప్లే స్టోర్ లో కనిపించని సిద్దూ యాప్
  • ఇప్పటికే యాప్ ను తొలగించిన కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీకి చెందిన 'విత్ ఐఎన్సీ' యాప్ నుంచి సమాచారం సింగపూర్ కంపెనీకి వెళుతోందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ ను కాంగ్రెస్ పార్టీ తొలగించింది. తాజాగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అధికారిక యాప్ కూడా గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాయమైంది.

సిద్దూ యాప్ నుంచి ఓ విదేశీ కంపెనీకి సమాచారం వెళుతోందనే ఆరోపణలు వచ్చాయి. సిద్దూ యాప్ కోసం ప్లే స్టోర్ లో వెతికినా యాప్ లేదని చూపిస్తోంది. మరోవైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి సంబంధించిన అన్ని వెబ్ సైట్లలో ముఖ్యమంత్రి ఫొటోలను తీసివేయాల్సిందిగా ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. 

More Telugu News