chennai super kings: రెండేళ్ల నిషేధం తర్వాత వచ్చీరాగానే వివాదంలో చిక్కుకున్న చెన్నై సూపర్ కింగ్స్

  • ఎల్లో ఆర్మీ పాటపై వెల్లువెత్తిన ఆగ్రహం
  • పాటలో నంబర్ 10 జెర్సీ కిందపడే సన్నివేశం
  • సచిన్ ను అవమానించారంటూ అభిమానుల ఫైర్

ఐపీఎల్ లో భాగంగా రూపొందించిన గీతంతో చెన్నై సూపర్ కింగ్స్ కొత్త వివాదంలో చిక్కుకుంది. 'ఎల్లో ఆర్మీ' పేరుతో కొనసాగే ఈ పాటలో... బట్టలు ఆరేసుకునే తీగ మీద నుంచి టెండూల్కర్ పేరుతో ఉన్న నంబర్ 10 జెర్సీ కిందపడిపోతుంది. ఇదే ఇప్పుడు వివాదానికి కారణమైంది. 'ఎల్లో ఆర్మీ' పాటలో ఆ జెర్సీని కింద పడేయడం ద్వారా సచిన్ ను అవమానించారంటూ ఆయన అభిమానులు మండిపడుతున్నారు. పాట నుంచి దీన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. స్పాట్ ఫిక్సింగ్ కేసులో రెండేళ్ల నిషేధం తర్వాత తిరిగి వచ్చిన చెన్నై జట్టుకు ఇది శరాఘాతంగా మారింది.

నంబర్ 10 జెర్సీని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వాడిన సంగతి తెలిసిందే. క్రికెట్ నుంచి సచిన్ రిటైర్ అయిన తర్వాత ఆయన గౌరవార్థం నంబర్ 10 జెర్సీకి కూడా బీసీసీఐ రిటైర్మెంట్ ప్రకటించింది. దీంతో, భారత్ లో ఎవరూ నంబర్ 10 జెర్సీని ధరించడం లేదు.

More Telugu News