Telangana: తెలంగాణలో 83,048 పోస్టుల భర్తీకి అనుమతులు జారీ చేశాం: ప్రభుత్వం

  • తెలంగాణలో వివిధ ప్రభుత్వ శాఖల్లో మొత్తం ఖాళీలు1,10,012
  • భర్తీ చేసిన పోస్టులు 28,116
  • భర్తీకి ప్రకటనలు జారీ అయన పోస్టులు 52, 724
  • భర్తీ కావాల్సినవి 83,048

తెలంగాణ వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో మొత్తం 1,10,012 పోస్టులు ఖాళీగా ఉన్నాయని శాసనమండలిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు ఎన్.రామచంద్రారావు, సభావత్ రాములు నాయక్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, లక్షా పది వేలకు పైగా ఖాళీల్లో ఇప్పటి వరకు 28,116 పోస్టులు భర్తీ చేశామని, మరో 52, 724 పోస్టుల భర్తీకి నియామక ప్రకటనలు జారీ అయ్యాయని చెప్పారు. ఇంకా మిగిలి ఉన్న 83,048 పోస్టుల భర్తీకి అనుమతులు జారీ చేశామని ప్రభుత్వం ప్రకటించింది. అత్యధికంగా హోం శాఖలో ఖాళీలు ఉన్నాయని, ఆ తరువాత వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ, ఆ తరువాత పాఠశాల విద్యావిభాగాల్లో ఖాళీలు ఉన్నాయని వివరించారు.

More Telugu News