yadagirigutta: ఇంకా అక్రమ జంటలకు అడ్డాగానే... యాదగిరిగుట్ట కార్డన్ సెర్చ్ లో అవాక్కైన పోలీసులు!

  • తెలంగాణలోని పుణ్యక్షేత్రాల్లో యాదగిరిగుట్ట
  • వందల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు
  • అయినా మారని వాతావరణం
  • పోలీసుల తనిఖీల్లో బయటపడిన ప్రేమ జంటలు

యాదగిరిగుట్ట... తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. హైదరాబాద్ నుంచి దాదాపు గంటన్నర సేపు ప్రయాణిస్తే చేరుకోవచ్చు. గతంలో ఇక్కడికి భక్తుల కన్నా అధిక సంఖ్యలో ప్రేమపక్షులు, తమ తాత్కాలిక కామ వాంఛలను తీర్చుకునే జంటలు వచ్చి హోటళ్లలో మకాం వేసేవారు. పోలీసులు తనిఖీలు చేసినప్పుడల్లా పదుల సంఖ్యలో ప్రేమ జంటలు పట్టుబడుతూ ఉండేవి కూడా.

యాదగిరిగుట్టను మరింతగా అభివృద్ధి చేయాలని భావించిన తెలంగాణ ప్రభుత్వం అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెంచడంతో ప్రేమ జంటల రాక తగ్గిపోయిందని గత రెండేళ్లుగా భావిస్తూ వచ్చారు. కానీ, ఆ భావన తప్పని రుజువైంది. నిన్న వందలాది మంది పోలీసులు యాదగిరిగుట్టలో కార్డన్ సెర్చ్ నిర్వహించగా, లాడ్జీల్లో మకాం వేసిన అక్రమ జంటలు పట్టుబడ్డాయి.

 మొత్తం 14 మందిని అదుపులోకి తీసుకున్నామని పోలీసు అధికారులు వెల్లడించారు. పది మంది రౌడీ షీటర్లను గుర్తించామని, పాత నేరస్తులను బైండోవర్ చేశామని తెలిపారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 40 బైకులను, ఐదు ఆటోలు, 4 కార్లను కూడా స్వాధీనం చేసుకున్నామని, అయితే, పెళ్లి కాకుండా కలసి వచ్చి లాడ్జీలను ఆశ్రయిస్తున్న జంటలను చూసి అవాక్కయ్యామని పోలీసులే అంటున్న పరిస్థితి కనిపిస్తోంది.

More Telugu News