Cricket: స్మిత్, వార్నర్ కి ఇదేమీ కొత్త కాదు.. నేను ఇంతకుముందే నివేదిక పంపాను: అంపైర్ డరైల్ హార్పర్

  • 2016లో స్మిత్, వార్నర్ టాంపరింగ్ కు ప్రయత్నించారు
  • న్యూసౌత్ వేల్స్ కు ఆడేటప్పుడు వారీ ప్రయత్నం చేశారు
  • బాల్ టాంపరింగ్ పై అప్పట్లోనే సీఏకు ఈమెయిల్ పెట్టాను

బాల్‌ టాంపరింగ్‌ ఉదంతంతో ఏడాది నిషేధానికి గురైన స్టీవెన్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌ లకు బంతి ఆకారాన్ని దెబ్బ తీయడం అలవాటేనని మాజీ అంపైర్ డరైల్ హార్పర్ పేర్కొన్నాడు. బాల్ టాంపరింగ్ నేపథ్యంలో ఒక ఆస్ట్రేలియా పత్రికకు ప్రత్యేక కథనం రాసిన ఆయన... అందులో స్మిత్, వార్నర్ లు దేశవాళీ క్రికెట్ లో కూడా టాంపరింగ్ కు పాల్పడ్డారని చెప్పాడు. 2016లో ఆసీస్ దేశవాళీ మ్యాచ్ లకు తాను రిఫరీగా పని చేశానని ఆయన తెలిపాడు.

ఆ టోర్నీలో స్మిత్, వార్నర్ లు న్యూసౌత్‌ వేల్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించారని చెప్పాడు. ఆ సందర్భంగా జరిగిన మ్యాచ్ లో వాళ్లిద్దరూ బంతి స్వరూపాన్ని మార్చే ప్రయత్నం చేశారని, దీనిని తాను అప్పుడే క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) చీఫ్‌, రిఫరీ సైమన్‌ టౌఫెల్‌ కు ఈమెయిల్‌ కూడా పంపానని ఆయన తెలిపాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్ లో స్మిత్‌, వార్నర్‌ బాల్ టాంపరింగ్ కు పాల్పడ్డారన్న వార్త తనకు ఆశ్చర్యం కలిగించలేదని ఆయన స్పష్టం చేశాడు. 

More Telugu News