assembly: తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా

  • 13 రోజుల పాటు సాగిన శాసనసభ సమావేశాలు
  • తొలిరోజే సభలో గందరగోళం
  • కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ శాసనసభ సభ్యత్వాల రద్దు

13 రోజుల పాటు సాగిన తెలంగాణ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. ఈ నెల 12న ప్రారంభమైన బడ్జెట్‌ సమావేశాలు 60 గంటల 58 నిమిషాలపాటు జరిగాయి. ఈ సమావేశాల్లో రాష్ట్ర బడ్జెట్‌, ఇతర ప్రజా సమస్యలపై చర్చించగా, 11 బిల్లులను ఆమోదించారు. నేడు శాసనసభలో ప్రవేశపెట్టిన నూతన పంచాయతీరాజ్‌ బిల్లు ఎలాంటి సవరణలు లేకుండానే ఆమోదం పొందింది. కాగా, శాసనసభ సమావేశాల ప్రారంభంలోనే గవర్నర్ ప్రసంగాన్ని కాంగ్రెస్ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ కంటికి గాయమైంది. దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల శాసనసభ సభ్యత్వాలను రద్దుచేశారు.

More Telugu News