laloo prasad yadav: నితీష్ కుమార్ పని ముగిసిపోయినట్టే: రైల్వే స్టేషన్ లో లాలూ ప్రసాద్ యాదవ్

  • బీహార్ ను బీజేపీ రావణకాష్టంలా మార్చేసిందన్న లాలూ
  • నితీష్ పని అయిపోయిందని చెప్పడానికి ఇదే నిదర్శనమన్న ఆర్జేడీ అధినేత
  • వైద్య చికిత్స కోసం ఢిల్లీ చేరుకున్న లాలూ

బీహార్ లో చెలరేగిన అల్లర్ల వెనుక బీజేపీ కుట్ర ఉందని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోపించారు. బీహార్ మొత్తం అల్లర్లు, హింసతో అట్టుడుకుతోందని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని బీజేపీ రావణకాష్టంలా మార్చేసిందని చెప్పారు. దీని దెబ్బకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పని అయిపోయినట్టేనని ఆయన అన్నారు. వైద్య చికిత్స నిమిత్తం రాంచీ నుంచి ఢిల్లీకి ఆయన వెళ్లారు. ఢిల్లీ చేరుకున్న తర్వాత రైల్వే స్టేషన్ లో వేచి ఉన్న మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నితీష్ పని ముగిసిపోయిందని చెప్పడానికి ఈ అల్లర్లే నిదర్శనమని చెప్పారు.

బీహార్ లోని భాగల్పూర్ లో ఈనెల 17న మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. కేంద్ర మంత్రి అశ్విని చౌబే కుమారుడు అర్జిత్ శాశ్వత్ నాయకత్వంలో భజరంగ్ దళ్, ఆరెస్సెస్ నిర్వహించిన ఓ ఊరేగింపు సందర్భంగా ఈ అల్లర్లు చోటు చేసుకున్నాయి. హింసను రెచ్చగొట్టినట్టు అర్జిత్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది.

More Telugu News