hen: తల తెగిపడినా వారం రోజులుగా బతికున్న కోడి!

  • జంతువు దాడిలో తల పోగొట్గుకున్న కోడి
  • కోడిని దత్తత తీసుకున్న వెటర్నరీ డాక్టర్
  • కోడికి డ్రాప్స్ రూపంలో ఆహారం

ఓ జంతువు దాడిలో తల తెగిపడిన కోడిపెట్ట వారం రోజులుగా బతికి ఉండడం సోషల్ మీడియాలో నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దాని వివరాల్లోకి వెళ్తే.. సెంట్రల్ థాయ్ లాండ్ లోని రాట్చ్ బురిలో వారం క్రితం ఒక కోడి మరో జంతువు దాడిలో తలను కోల్పోయింది. అయినప్పటికీ అది నడుస్తుండడంతో దానిని వెటర్నరీ సర్జన్ దత్తత తీసుకున్నారు.

మెడ ద్వారా డ్రాప్స్‌ రూపంలో దానికి ఆహారం అందిస్తున్నారు. అలాగే వ్యాధులకు గురికాకుండా యాంటీబయాటిక్స్ కూడా ఇస్తున్నారు. తన చికిత్సకి కోడి బాగా స్పందిస్తోందని ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించిన కథనాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 

More Telugu News