suzuki: భారత మార్కెట్లో చేతులు కలిపిన కార్ల కంపెనీలు సుజుకి, టొయోటా

  • పరస్పరం కార్లను సరఫరా చేసుకునేందుకు ఒప్పందం
  • సుజుకీ బాలెనోర, బ్రెజ్జా కార్లు టొయోటాకు
  • టొయోటా కొరల్లా మోడల్ కార్లు సుజుకీకి

జపాన్ కు చెందిన రెండు అగ్రగామి కార్ల కంపెనీలు సుజుకి మోటార్ కార్పొరేషన్, టొయోటా మోటార్ కార్పొరేషన్ ఓ ఒప్పందానికి వచ్చినట్టు ప్రకటించాయి. హైబ్రిడ్, ఇతర వాహనాలను భారత మార్కెట్ కు పరస్పరం అందించేందుకు ఉద్దేశించినది ఈ ఒప్పందం. దీని ప్రకారం... సుజుకీ సంస్థ ప్రాచుర్యం పొందిన బాలెనో, విటారా బ్రెజ్జా మోడల్ కార్లను టొయోటాకు సరఫరా చేస్తుంది.

 అదే సమయంలో టొయోటా కంపెనీ కొరల్లా మోడల్ ను సుజుకీకి సరఫరా చేస్తుంది. అయితే ఎవరెన్ని వాహనాలు సరఫరా చేయాలి, ఎప్పటి నుంచి చేయాలి? వాహనాల్లో స్పెసిఫికేషన్లు ఏమిటి? వంటి అంశాలను తర్వాత పరిశీలిస్తామని ఇరు కంపెనీలు ప్రకటించాయి. వేగంగా వృద్ధి చెందుతున్న భారత మార్కెట్లో ఆదరణ పొందుతున్న మోడల్ కార్లను ఈ రెండు సంస్థలు పరస్పరం పంపిణీ చేసుకోవడం ద్వారా విక్రయాలు పెంచుకోవడం ఒప్పందంలోని ఉద్దేశ్యం.

More Telugu News