NTR: అందరూ అనుకునేది వేరు, నేను వేరు... ఆ మాటే నా హృదయస్పందన: బాలకృష్ణ

  • మహానుభావుడంటే ఎన్టీఆర్
  • 'ఎన్' అంటే నటనాలయం
  • 'టీ' అంటే తారా మండలంలోని ధ్రువతార
  • 'ఆర్' అంటే రాజర్షి, రారాజు

ఎన్టీఆర్ అంటే నందమూరి తారక రామారావుగా అందరూ అనుకుంటారని, తనకు మాత్రం ఎన్టీఆర్ అన్న మాటే తన హృదయ స్పందనని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభమైన తరువాత మాట్లాడిన ఆయన, తనకు తండ్రి, గురువు, దైవం ఎన్టీఆరేనని చెప్పారు. ఈ భూమిపై ఎందరో పుడుతూ ఉంటారని, అందరినీ మహానుభావులుగా భావించలేమని, ఆ స్థానానికి తగ్గ వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు.

శంకరాచార్యులు, రామానుజాచార్యులు, గౌతమీపుత్ర శాతకర్ణి, అంబేద్కర్, మహాత్మాగాంధీ వంటి వారి సరసన నిలిచే అర్హతున్న వ్యక్తి ఎన్టీఆర్ అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. 'ఎన్' అంటే నటనాలయం. ఆయన ఇల్లే నటనాలయం. ఆయన నటరాజు నటసింహుడు. 'టీ' అంటే తారా మండలంలోని ధ్రువతారకుడు. 'ఆర్' అంటే రాజర్షి, రారాజు, రాజకీయ దురంధరుడు... అని చెప్పారు. తెలుగు జాతి చరిత్రను ప్రతి విద్యార్థికీ తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సినిమా రంగంలో ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ ను అభిమానించారని గుర్తు చేశారు. ఈ సినిమాను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి విడుదల చేయనున్నట్టు తెలిపారు.

More Telugu News