Sai pallavi: లేడీ ఓరియంటెడ్ సినిమాలో సాయిపల్లవి...!

  • 'నీది నాది ఒకే కథ' దర్శకుడు చెప్పిన కథ నచ్చినట్లు ప్రచారం
  • ఓకే చెప్పినట్లు సమాచారం
  • మంచి కథలనే ఎంపిక చేసుకుంటున్న తమిళ పొన్ను

ఫిదా, ఎంసీఏ చిత్రాల ద్వారా చక్కటి నటిగా గుర్తింపు తెచ్చుకున్న తమిళ పొన్ను సాయిపల్లవికి మరో అద్భుతమైన ఆఫర్ తలుపు తట్టినట్లు తెలిసింది. హీరోయిన్ ప్రాధాన్యమున్న ఓ చిత్రంలో నటించేందుకు ఆమె పచ్చజెండా ఊపినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఇటీవల విడుదలై సక్సెస్ టాక్ తెచ్చుకున్న 'నీది నాది ఒకే కథ' చిత్రం దర్శకుడు వేణు ఉడుముల ఓ నవతరం యువతి నేపథ్యంలో సాగే కథని సిద్ధం చేశారని, దానిని సాయిపల్లవికి వినిపించారని, అది ఆమెకు నచ్చడంతో నటించడానికి ఓకే చెప్పిందని సమాచారం. సాయిపల్లవి మొదట్నుంచీ మంచి పాత్రలైతేనే ఓకే చెబుతోంది. ఒకవేళ తనకు నచ్చకపోతే నిర్మొహమాటంగా తిరస్కరిస్తోంది. మరి ఈ సినిమాకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే ఆ కథలో తప్పక బలముంటుందని తెలుస్తోంది.

More Telugu News