ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు.. ప్రయాణికులను దించేసిన సిబ్బంది

28-03-2018 Wed 17:19
  • ఢిల్లీ విమానాశ్రయంలో కలకలం
  • ఎయిరిండియా కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి బెదిరించిన ఆగంతుకుడు
  • విమానంలో భ‌ద్ర‌తా సిబ్బంది త‌నిఖీలు  

ఢిల్లీ విమానాశ్రయంలో క‌ల‌క‌లం చెల‌రేగుతోంది. ఢిల్లీ-కోల్‌కతా ఎయిరిండియా ఏ1-020 విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావ‌డంతో.. ఆ విమానంలోంచి ప్రయాణికులను దించేసి త‌నిఖీలు చేస్తున్నారు. కొద్ది సేప‌టి క్రితం ఓ ఆగంతు‌కుడు ఎయిరిండియా కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి ఈ విష‌యం చెప్పాడ‌ని అధికారులు తెలిపారు. విమానం టేకాఫ్ కాకుండా ఆపేశామ‌ని, ప్ర‌స్తుతం విమానంలో భ‌ద్ర‌తా సిబ్బంది త‌నిఖీలు చేస్తున్నార‌ని చెప్పారు. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి స‌మాచారం అందాల్సి ఉంది.