David Warner: బ్రేకింగ్....స్మిత్, వార్నర్‌పై ఏడాది నిషేధం

  • బాల్ ట్యాంపరింగ్ కేసులో క్రికెట్ ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం
  • యువ ఆటగాడు బెన్ క్రాప్ట్‌పై 9 నెలల నిషేధం
  • నిషేధంపై అప్పీలుకు వారం రోజుల గడువు

బాల్ ట్యాంపరింగ్‌ వివాదంలో చిక్కుకున్న ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఏడాది పాటు నిషేధం విధిస్తూ ఈ రోజు సంచలన నిర్ణయం తీసుకుంది. బాల్ ట్యాంపరింగ్‌కు ప్రయత్నించిన యువ ఆటగాడు కేమరాన్ బెన్ క్రాఫ్ట్‌పై 9 నెలల నిషేధం విధించింది. తాను విధించిన శిక్షలపై అప్పీలుకు సీఏ వారికి వారం రోజుల గడువు ఇచ్చింది.

ట్యాంపరింగ్ ఉదంతానికి ఈ ముగ్గురే కారకులంటూ క్రికెట్ ఆస్ట్రేలియా ఈ మేరకు శిక్షలు ఖరారు చేయడం గమనార్హం. మరోవైపు బాల్ ట్యాంపరింగ్ ఉదంతం నేపథ్యంలో స్టీవ్ స్మిత్‌ను ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ, డేవిడ్ వార్నర్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాయి. సీఏ తాజా నిర్ణయంతో మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్ టోర్నీలో వారిద్దరూ ఆడతారా?లేదా? అన్నది సందేహంగా మారింది. బీసీసీఐతో సంబంధిత ఫ్రాంచైజీలు చర్చలు జరిపిన తర్వాతే దీనిపై ఓ క్లారిటీ వస్తుంది.

More Telugu News