devid warner: ఏడాది నిషేధం అమలైతే భారీగా నష్టపోనున్న వార్నర్

  •  ఏడాదిలో వార్నర్ కోల్పోనున్న 13 టెస్టులు, 24 వన్డేలు, 5 టీ20లు 
  • సీఏ ఇచ్చే 19.6 కోట్ల రూపాయలు నష్టం
  • ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాదు ఫ్రాంఛైజీ ఇచ్చే 12.5 కోట్లు నష్టం

సఫారీ పర్యటనలో బాల్ టాంపరింగ్ వివాదంతో అన్నివైపుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఆసీస్ క్రికెటర్ డేవిడ్‌ వార్నర్‌ తాజా వివాదంతో పూర్తిగా నష్టపోనున్నాడు. వైస్ కెప్టెన్ గా వార్నర్  ఏడాదిలో 13 టెస్టులు, 24 వన్డేలు, 5 టీ20లకు దూరం కానున్నాడు. దీంతో మ్యాచ్‌ ఫీజుల రూపంలో సీఏ నుంచి దక్కాల్సిన 19.6 కోట్ల రూపాయలను కోల్పోతాడు. ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాదు ఫ్రాంఛైజీ ఇవ్వాల్సిన 12.5 కోట్ల రూపాయలను కోల్పోనున్నాడు.

అలాగే అద్భుత ఆటతీరుతో ఒప్పందాలు చేసుకున్న బ్రాండ్ కంపెనీలు ఆసీక్స్‌, ఎల్జీ ఎలక్ట్రానిక్స్‌, ఛానెల్‌ 9, గ్రే నికోలస్‌, మిలో, మేక్‌ మై విష్‌ సంస్థలు అందించే పారితోషికాన్ని కూడా కోల్పోతాడు. దీంతో వీటన్నింటి నుంచి వార్నర్ వైదొలగాల్సి ఉంటుంది. ఏడాది తరువాత క్రికెట్ లో పునఃప్రవేశం చేసినప్పటికీ దేశవాళీ టోర్నీల్లో నిరూపించుకోవాల్సి ఉంటుంది. జాతీయ జట్టుకు ఎంపికైనప్పటికీ ఇప్పుడున్న డిమాండ్ అప్పుడు ఉండే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో వార్నర్ భారీగా నష్టపోనున్నాడు. 

More Telugu News