facebook: డేటా సేకరిస్తోందంటూ ఫేస్ బుక్ పై ముగ్గురు యూజర్ల న్యాయపోరాటం

  • నార్తర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ క్యాలిఫోర్నియా కోర్టులో వ్యాజ్యం
  • గోప్యత హక్కు ఉల్లంఘిస్తోందని ఆరోపణలు
  • నష్ట పరిహారం కోసం డిమాండ్

డేటా చౌర్యం ఘటనలో ఫేస్ బుక్ పై ముగ్గురు యూజర్లు న్యాయపోరాటం మొదలు పెట్టారు. సోషల్ నెట్ వర్క్ సంస్థ ఫేస్ బుక్ తమ ఫోన్ కాల్ లాగ్స్, టెక్ట్స్ సందేశాల సమాచారాన్ని తీసుకోవడం ద్వారా గోప్యత హక్కులను ఉల్లంఘించిందంటూ నార్తర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ క్యాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. బాధిత యూజర్లు అందరి తరఫున దీన్ని క్లాస్ యాక్షన్ సూట్ గా పరిగణించాలని, జరిగిన నష్టానికి గాను యూజర్లకు పరిహారం ఇప్పించాలని కోర్టును కోరారు. దీనిపై ఫేస్ బుక్ ఇంకా స్పందించలేదు.

కేంబ్రిడ్జ్ ఎనలైటికా అనే సంస్థ ఓ యాప్ సాయంతో ఫేస్ బుక్ యూజర్లకు సంబంధించిన కీలక డేటాను చోరీ చేసినట్టు వెలుగు చూసిన విషయం తెలిసిందే. దీనిపైనే ఆ సంస్థ ప్రపంచవ్యాప్తంగా సమస్యలను ఎదుర్కొంటోంది. ఫేస్ బుక్ చీఫ్ మార్క్ జుకెర్ బర్గ్ అందరికీ క్షమాపణలు కూడా చెప్పారు. అయితే ఇదే సమయంలో ఫేస్ బుక్ యూజర్ల సమాచారాన్ని సేకరిస్తుందన్న ఆరోపణలు రావడం సమస్యను పెద్దది చేసింది. వీటిని ఫేస్ బుక్ ఖండించింది. యూజర్ల సమాచారం భద్రంగా ఉంటుందని, కేవలం ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ లో వారు ఆప్షన్ ఇస్తేనే కాల్, టెక్ట్స్ డేటా సేకరించడం జరుగుతుందని ఆ సంస్థ తెలిపింది.  

More Telugu News