No Confidence Motion: సేమ్ సీన్... సుమిత్రా మహాజన్ వెంట అదే డైలాగ్!

  • చర్చకు రాని అవిశ్వాస తీర్మానం
  • వెల్ ను వదిలిపెట్టని అన్నాడీఎంకే సభ్యులు
  • చర్చించే పరిస్థితి లేదన్న స్పీకర్
  • ఏప్రిల్ 2కు సభ వాయిదా

వరుసగా ఎనిమిదో సెషన్ లోనూ అవిశ్వాస తీర్మానం చర్చకు రాలేదు. ఈ ఉదయం 11 గంటలకు లోక్ సభ ప్రారంభమైన తరువాత, అన్నాడీఎంకే సభ్యులు కావేరీ నదీ జలాల బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ, ప్లకార్డులు పట్టుకుని వెల్ లో నినాదాలు చేస్తుండటంతో, నిమిషం వ్యవధిలోనే మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా వేసిన స్పీకర్ సుమిత్రా మహాజన్, 12 గంటల తరువాత కొన్ని బిల్లులకు ఆమోదం తెలిపి, ఆపై ఏప్రిల్ 2 సోమవారానికి వాయిదా వేశారు.

 తనకు తోట నరసింహం, అసదుద్దీన్ ఒవైసీ, మల్లికార్జున ఖర్గే వంటి వారు ఇచ్చిన అవిశ్వాస నోటీసులు అందాయని, వాటికి మద్దతిస్తున్న సభ్యుల సంఖ్య లెక్కించలేని పరిస్థితి నెలకొని ఉన్నందున, తన ముందు సభను వాయిదా వేయడం మినహా మరో మార్గం లేదని, గత ఏడు సెషన్లుగా చెబుతున్న మాటలే చెబుతూ సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

More Telugu News