train 18: భారత బుల్లెట్ ‘ట్రెయిన్ 18’ ఘనత ఇదే... ఎన్నో సౌకర్యాలు... 160 కిలోమీటర్ల వేగం... జూన్ నుంచి పరుగులు!

  • రెండు పట్టణాల మధ్య తొలుత అందుబాటులోకి
  • శతాబ్ది రైళ్ల స్థానంలో ప్రవేశపెట్టాలన్న ఆలోచన
  • పూర్తిగా ఏసీతో రెండు రకాల కోచ్ లు

పూర్తి స్వదేశీ టెక్నాలజీతో రూపొందిన బుల్లెట్ ట్రెయిన్ 18 ప్రయాణానికి సిద్ధమవుతోంది. ఈ ఏడాది జూన్ లో దీన్ని ప్రారంభించనున్నారు. ప్రస్తుతం శతాబ్ది రైళ్ల స్థానంలో ట్రెయిన్ 18ను ప్రవేశపెడతారు.

విశేషాలు

  • గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అందుకే దీన్ని దేశీయ బుల్లెట్ ట్రెయిన్ గా అభివర్ణిస్తున్నారు.
  • రెండు పట్టణాల మధ్య ప్రయాణానికి తొలుత దీన్ని విడుదల చేస్తారు. ఉదాహరణకు హైదరాబాద్-విజయవాడ, విశాఖపట్నం-చెన్నై వంటి మార్గాలు.
  • చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ దీన్ని తయారు చేస్తోంది. ఇదే తరహా దిగుమతి చేసుకుంటున్న రైలు ధర కంటే తాము సగానికే ఉత్పత్తి చేస్తున్నట్టు చెన్నై ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అంటోంది.
  • ఈ రైలులో 16 కోచ్ లు ఉంటాయి. రైలు పూర్తిగా ఏసీ సదుపాయంతో, చెయిర్ కార్ టైప్ ఉంటుంది. ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ అని రెండు రకాల కోచ్ లు ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ లో సీటింగ్ కెపాసిటీ 56. నాన్ ఎగ్జిక్యూటివ్ కోచ్ లో 78 మంది కూర్చుని ప్రయాణం చేయవచ్చు.
  • వైైఫై సదుపాయం ఉంటుంది.

More Telugu News