Telangana: తెలంగాణలో 22 వేల పోలీసు కొలువుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్

  • 18 వేల పోస్టుల భర్తీకి మరో 15 రోజుల్లో నోటిఫికేషన్ జారీ
  • జైళ్లు, అగ్నిమాపక శాఖ, ఎస్పీఎఫ్, ఆర్టీసీ విభాగాల్లో మరో 4 వేల పోస్టులు భర్తీ
  • పోలీసు అభ్యర్థులకు శిక్షణా విధానంలోనూ స్వల్ప మార్పులు చేయనున్న అధికారులు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా త్వరలో 22 వేల పోలీసు కొలువులు భర్తీ కానున్నాయి. ఇందులో కానిస్టేబుల్, ఎస్సై స్థాయిలో 18 వేల పోస్టుల భర్తీకి మరో 15 రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుంది. జైళ్లు, అగ్నిమాపక శాఖ, ఎస్పీఎఫ్, ఆర్టీసీ విభాగాల్లో మరో 4 వేల పోస్టులు భర్తీ కానున్నాయి. మొత్తంగా చూస్తే, 22 వేల పోస్టుల భర్తీకి పోలీసు నియామక బోర్డు దశలవారీగా నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్‌తో పాటు గత నోటిఫికేషన్‌లోని కొన్ని అంశాల్లో స్వల్ప మార్పులు చేయాల్సి ఉన్నందున తాజా నోటిఫికేషన్ కాస్త ఆలస్యమవుతోంది. కాగా, రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత నోటిఫికేషన్ వెలువడుతుందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

మరోవైపు గతంలో ఎన్నడూ లేని విధంగా కానిస్టేబుల్ నుంచి ఆ పైస్థాయి అధికారుల వరకు ప్రభుత్వం భారీగా పదోన్నతులు కల్పించింది. ఫలితంగా ఏర్పడిన ఖాళీల భర్తీకి ప్రస్తుత నోటిఫికేషన్‌లో భారీ సంఖ్యలో ఎస్సై పోస్టులను కేటాయించనున్నారు. పోలీసు అభ్యర్థులకు శిక్షణా విధానంలోనూ అధికారులు స్వల్ప మార్పులు చేయనున్నారు. సాంకేతికతకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ టెక్నికల్ సర్వీసెస్, కంప్యూటర్ టెక్నాలజీ, కమ్యూనికేషన్స్‌కు సంబంధించిన అంశాలపై ప్రత్యేక సిలబస్ తయారు చేస్తున్నారు. మరోవైపు పోలీసు పోస్టుల భర్తీకి ఈసారి వయోపరిమితిలో సడలింపుపై ఇంకా స్పష్టత లేదు.

More Telugu News