North Korea: ఆద్యంతం సీక్రెట్... చైనాలో కిమ్ జాంగ్ పర్యటన... వచ్చి వెళ్లిన తరువాతే వివరాలు బయటకు!

  • మంగళవారం నాడు చైనాలో పర్యటించిన కిమ్ జాంగ్
  • కిమ్ వెళ్లిపోయిన తరువాతనే బయటకు వెల్లడైన వార్త
  • పర్యటన వివరాలు చెప్పిన 'క్సిన్హువా'

చైనాలో అనధికారికంగా పర్యటించిన ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్, భవిష్యత్తులో అణ్వస్త్రాలను నిర్మూలించేందుకు కృషి చేస్తానని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కు హామీ ఇచ్చారు. బీజింగ్ కు వచ్చిన కిమ్ కు చైనా అధికారులు ఘన స్వాగతం పలుకగా, సైనిక వందనాన్ని స్వీకరించారు. ఆపై జిన్ పింగ్ తో ఏకాంతంగా చర్చలు జరిపారు.

మంగళవారం నాడు సతీ సమేతంగా కిమ్ చైనాలో పర్యటించగా, ఆయన తిరిగి ఉత్తర కొరియాకు చేరిన తరువాతనే చైనా అధికార మీడియా, ఈ పర్యటన గురించి తొలి వార్తలను ప్రసారం చేయడం గమనార్హం. ఇరు దేశాధి నేతల మధ్యా 'గ్రేట్ హాల్'లో చర్చలు జరిగాయని, ఉత్తర కొరియా అధినేత అణ్వస్త్రాల కట్టడికి కట్టుబడతానని మాట ఇచ్చారని చైనా అధికార వార్తా సంస్థ 'జిన్హువా' తెలియజేసింది. ఉత్తర కొరియాకు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత కిమ్ తొలి విదేశీ పర్యటన ఇదే కావడం గమనార్హం. రెండు దేశాల మధ్య ఇప్పటికే బలంగా ఉన్న ద్వైపాక్షిక బంధాన్ని మరింతగా మెరుగుపరచుకునే దిశగా తీసుకోవాల్సిన చర్యలపైనా జిన్ పింగ్, కిమ్ ల మధ్య చర్చలు సాగినట్టు తెలుస్తోంది.

More Telugu News