Rahul dravid: కర్ణాటక ఎన్నికల్లో రాహుల్ ద్రవిడ్.. బరిలో కాదు.. ‘ఎలక్షన్ ఐకాన్’గా!

  • మే 12న కర్ణాటక శాసనసభకు ఎన్నికలు
  • రాహుల్ ద్రవిడ్‌ను ఎలక్షన్ ఐకాన్‌గా నియమించిన ఎన్నికల కమిషన్
  • యువ ఓటర్లను చైతన్యవంతం చేయనున్న మాజీ కెప్టెన్

కర్ణాటక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగి తేలుతుండగా,  టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌ను ఎన్నికల సంఘం ‘స్టేట్ ఎలక్షన్ ఐకాన్’గా ప్రకటించింది. ఈ విషయాన్ని చీఫ్ ఎలక్టోరల్ అధికారి సంజీవ్ కుమార్ తెలిపారు. అలాగే సంగీత దర్శకుడు యోగరాజ్ భట్ ఎన్నికల కోసం ఓ టైటిల్ సాంగ్ రూపొందిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర ఎన్నికల గీతంగా ఇది రూపుదిద్దుకుంటోందని, మరో వారంలో విడుదల చేస్తామని తెలిపారు.

దివ్యాంగులైన కొందరు ప్రభుత్వ ఉద్యోగులను తొలిసారి పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ సిబ్బందిగా నియమించనున్నట్టు సంజీవ్ కుమార్ తెలిపారు. ఎన్నికల సంఘం మంగళవారం కర్ణాటక ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. మే 12న సింగిల్ ఫేజ్‌లో ఎన్నికలు నిర్వహించనుండగా, 15న ఓట్లు లెక్కిస్తారు. కాగా, ‘ఎలక్షన్ ఐకాన్’గా ఎన్నికైన రాహుల్ ద్రవిడ్ యువ ఓటర్లను చైతన్య పరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.

More Telugu News