charan: చరణ్ బర్త్ డే సందర్భంగా బోయపాటి మూవీ నుంచి లేటెస్ట్ లుక్!

  • చరణ్ తో బోయపాటి మూవీ 
  • కొనసాగుతోన్న షూటింగ్
  • త్వరలో పలకరించనున్న ఫస్టులుక్ 

ఈ రోజున చరణ్ పుట్టిన రోజు .. ఈ కారణంగానే ఎక్కడ చూసినా మెగా అభిమానుల్లో సందడి కనిపిస్తోంది. చరణ్ పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని బోయపాటి సినిమా నుంచి ఒక లుక్ ను రిలీజ్ చేశారు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమా నుంచి వదిలిన పోస్టర్ లో చరణ్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. దాదాపు 'బ్రూస్ లీ' లుక్ కి దగ్గరగా వున్నాడనిపిస్తోంది.

నిన్న మొన్నటి వరకూ చరణ్ 'రంగస్థలం' సినిమాకి సంబంధించిన లుక్ తో వున్నాడు. ఆ వెంటనే ఆయన బర్త్ డే వచ్చేసింది. అందువలన వేరే లుక్ లోకి మారే సమయం లేకపోయింది. ఈ కారణంగానే ప్రస్తుతం చరణ్ ఉన్నట్టుగానే ఈ లుక్ ను బోయపాటి వదిలాడనీ, ఆ తరువాత చరణ్ లుక్ మారుస్తాడని అంటున్నారు. ప్రస్తుతం బోయపాటి సినిమా షూటింగ్ నడుస్తూనే వుంది. త్వరలో ఈ సినిమా నుంచి రానున్న ఫస్టులుక్ తో, చరణ్ లుక్ ఎలా వుంటుందనే విషయంలో స్పష్టత వస్తుందని చెప్పుకుంటున్నారు.     

More Telugu News