Facebook: ఫేస్ బుక్ ను శాశ్వతంగా డిలీట్ చేశా: బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అఖ్తర్

  • బలపడుతున్న గ్లోబల్‌ డిలీట్‌ ఫేస్‌ బుక్‌ ఉద్యమం
  • అనలిటికా డేటా బ్రీచ్‌ దుమారం నేపథ్యంలో ఫేస్ బుక్ ను వదిలేస్తున్న ప్రముఖులు 
  • హాలీవుడ్ బాటలో బాలీవుడ్

సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌ బుక్‌ ను శాశ్వతంగా డిలీట్ చేస్తున్నానని ప్రముఖ బాలీవుడ్ నటుడు, రచయిత, దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్ (33) ట్విట్టర్ మాధ్యమంగా ప్రకటించాడు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఫర్హాన్... డిలీట్ చేసినప్పటికీ తన ఫేస్ బుక్ ఖాతా ఇంకా ఉనికిలోనే ఉందని పేర్కొన్నాడు.

కాగా, కేంబ్రిడ్జ్ అనలిటికా డేటా బ్రీచ్‌ దుమారం నేపథ్యంలో అమెరికాలో పలువురు నెటిజన్లు ఫేస్ బుక్ కు మంగళం పాడుతున్నారు. అందులో పలువురు హాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఉన్నారు. దీంతో ఫేస్ బుక్ వ్యతిరేక ఉద్యమం ఊపందుకుంటోంది. ఫేస్ బుక్ ను వాడొద్దంటూ గ్లోబల్‌ డిలీట్‌ ఫేస్‌ బుక్‌ ఉద్యమం ఉద్ధృతమవుతోన్న నేపథ్యంలో ఫర్హాన్ నిర్ణయం భారత్ లో ఆ సంస్థపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. 

More Telugu News