Bride: లింగ సమానత్వం కోసం రాజస్థాన్‌లో వెరైటీగా నినదించిన వధువు!

  • పెళ్లికి ముందుగా గుర్రపు స్వారీ చేసిన వధువు
  • లింగసమానత్వ సందేశాన్ని పంపమని తన కుటుంబం కోరిందని వెల్లడి
  • కొడుకులు-కూతుళ్లకు సమాన అవకాశాలు కల్పించాలంటూ సందేశం

లింగ సమానత్వ సందేశాన్ని సమాజానికి అందించే ప్రయత్నంలో భాగంగా రాజస్థాన్‌లోని ఝుంఝును ప్రాంతానికి చెందిన ఓ వధువు గుర్రపు స్వారీ చేసింది. నావల్‌గఢ్‌ ప్రాంతంలో తన వివాహ తంతుకు ముందుగా ఆమె ఇలా గుర్రపు స్వారీతో ఆకట్టుకుంది.

"లింగసమానత్వ సందేశాన్ని ఈ సమాజానికి అందివ్వమని నా కుటుంబం నన్ను కోరింది. ఎవరైనా సరే కుమార్తెలు, కుమారుల మధ్య తేడా చూపరాదని, ఇద్దరికీ సమాన అవకాశాలు కల్పించాలంటూ ఓ సందేశాన్ని పంపమని నా తల్లిదండ్రులు నన్ను కోరారు" అని వధువు వివరించింది. కాగా, ఆమె గుర్రపు సవారీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

More Telugu News