Kim Jong Un: ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న కిమ్ జాంగ్ ఉన్ నిర్ణయం.. తొలిసారి విదేశీ పర్యటన?

  • తొలిసారి దేశం వీడుతున్న నార్త్ కొరియా చీఫ్
  • చైనా పర్యటనకు ఏర్పాట్లు
  • ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచం
  • పర్యటన వివరాలు టాప్ సీక్రెట్

ఉత్తర కొరియా చీఫ్ కిమ్ జాంగ్ ఉన్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకున్నారు. 2011లో అధికారంలోకి వచ్చాక తొలిసారి విదేశీ పర్యటనకు సన్నాహాలు చేస్తున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా బయటకు వచ్చింది. చైనాలో ఆయన పర్యటించనున్నట్టు తెలిసి పలు దేశాలు ఆశ్చర్యం నుంచి తేరుకోలేకపోతున్నాయి. అధికారంలోకి వచ్చి ఏడేళ్లు అయినా ఇప్పటి వరకు దేశం దాటి బయటకు అడుగుపెట్టని ఆయన తొలిసారి చైనానే ఎంచుకోవడం విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

చైనాలో ఆయన ఎవరిని కలవబోతున్నారు? ఎన్ని రోజులు పర్యటిస్తారన్న విషయాలు మాత్రం బయటకు పొక్కలేదు. కిమ్ ఓ ప్రత్యేక రైలు ద్వారా ఉత్తర సరిహద్దు పట్టణమైన డాన్‌డోంగ్ మీదుగా చైనాలో అడుగుపెట్టనున్నట్టు తెలుస్తోంది. కిమ్ తండ్రి ఉపయోగించిన రైలు లాంటిదే సోమవారం ఓ రైలు బీజింగ్‌కు చేరుకుంది.

2011లో తన మరణానికి ముందు కిమ్ జాంగ్ 11 ఇటువంటి రైలులోనే చైనాను సందర్శించారు. ఇప్పుడు బీజింగ్‌కు చేరుకున్నట్టు ఓ టీవీ చానల్ చూపించిన రైలు కూడా అచ్చం అలాగే ఉండడంతో కిమ్ పర్యటన వార్తలకు బలం చేకూరింది. కిమ్‌ను కలిసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించిన కొన్ని వారాల్లోనే కిమ్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ట్రంప్-కిమ్ భేటీ కంటే కిమ్ చైనా పర్యటన మరింత ఫలవంతమవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

More Telugu News