Narendra Modi: టార్గెట్ చంద్రబాబు... ప్రత్యేక హోదాపై పార్లమెంట్ లో మాట్లాడనున్న నరేంద్ర మోదీ!

  • వాయిదా పడుతూ వస్తున్న లోక్ సభ
  • బీజేపీ పట్ల వ్యతిరేకత వస్తుందన్న భావంలో కేంద్రం
  • నేడో, రేపో చర్చను చేపట్టే అవకాశం
  • స్వయంగా సమాధానం ఇవ్వనున్న నరేంద్ర మోదీ

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై గత పది రోజులుగా అవిశ్వాస తీర్మానాలను టీడీపీ, వైఎస్ఆర్ సీపీలు ఇస్తుండటం, టీఆర్ఎస్, అన్నాడీఎంకేల నిరసనను సాకుగా చూపి, చర్చించకుండా లోక్ సభ వాయిదా పడుతుండటంతో ప్రజల్లో బీజేపీ పట్ల వ్యతిరేకత పెరుగుతుందన్న ఉద్దేశంతో ఈ అంశంపై చర్చకు బీజేపీ అంగీకరించినట్టు తెలుస్తోంది.

ఇప్పటికే చర్చకు మానసికంగా సిద్ధమైన బీజేపీ, అవిశ్వాసాన్ని ఎదుర్కోవాలని, సంఖ్యాబలం ఉన్న కారణంగా ప్రభుత్వానికి ఏమీ కాదన్న నిర్ణయానికి వచ్చిందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ప్రత్యేక హోదాను ఇవ్వలేదని టీడీపీ, వైసీపీ ఎంపీలు విమర్శిస్తే, వారికి గట్టి సమాధానాన్ని ఇచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సిద్ధంగా ఉన్నారని, తనను విమర్శిస్తున్న ఏపీ సర్కారు తప్పులను లోక్ సభ సాక్షిగా ఎత్తి చూపాలని, చంద్రబాబే లక్ష్యంగా ఆయన పేరును ఎత్తకుండా విమర్శల దాడి చేయాలని మోదీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. సభలో ప్రసంగించాల్సిన ఎంపీలకు ఇప్పటికే ఏం మాట్లాడాలన్న విషయమై బీజేపీ పెద్దలు గణాంకాలు సహా సలహాలు, సూచలను ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ప్రత్యేక హోదాపై చర్చ నేడు చేపట్టినా, లేదా రేపు చేపట్టినా గట్టి సమాధానం ఇచ్చేందుకు తాము సిద్ధమని బీజేపీ వర్గాలు అంటున్నాయి. 

More Telugu News