Bhadrachalam: కన్నులపండువగా భద్రాద్రి రాములోరి కల్యాణం

  • అభిజిత్ లగ్నంలో వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవం
  • రాష్ట్రప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల
  • అనివార్య కారణాల వల్ల సీఎం కేసీఆర్ గైర్హాజరు

భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణం ఈ రోజు మధ్యాహ్నం కన్నులపండువగా జరిగింది. సర్వాంగ సుందరంగా ముస్తాబైన మిథిలా ప్రాంగణంలో వైభవంగా జరిగిన ఈ కల్యాణ మహోత్సవానికి భక్తులు అశేషంగా హాజరయ్యారు. అభిజిత్ లగ్నంలో సీతమ్మ వారి మెడలో స్వామివారు మాంగల్యధారణ చేశారు. ఈ కల్యాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టు వస్త్రాలను సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. అయితే అనివార్య కారణాల వల్ల ఆయన హాజరుకాకపోవడంతో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. ఈ మహోత్సవంలో ముఖ్యమంత్రి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఉదయం మూల విరాట్‌కు సుప్రభాత ఆరాధన నిర్వహించిన సంగతి తెలిసిందే. రేపు స్వామి వారి పట్టాభిషేకం జరుగుతుంది.

More Telugu News