New Delhi: ఏప్రిల్ నుంచి డ్రైవింగ్ లైసెన్స్ ఫారంలో తల్లి పేరు రాయొచ్చు....!

  • డ్రైవింగ్ లైసెన్సు ఫారాల్లో తండ్రి లేదా భర్త పేరుకు బదులుగా కోరుకుంటే తల్లి పేరు రాసే అవకాశం
  • ఏప్రిల్ నుంచే అమలుకు ఢిల్లీ రవాణ శాఖ యోచన
  • రవాణా శాఖలో లింగ సమానత్వానికి ఇదో భారీ ముందడుగని అధికారుల వెల్లడి

ఢిల్లీలో శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఆ రాష్ట్ర రవాణా శాఖ ఏప్రిల్ నుంచి ఓ అవకాశం కల్పిస్తోంది. ప్రస్తుతం లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో దరఖాస్తుదారులు తమ తండ్రి లేదా భర్త పేరు రాస్తున్నారు. అయితే వచ్చే నెల నుంచి వారు కోరుకుంటే తమ తండ్రి లేదా భర్త పేరుకు బదులుగా తల్లి పేరును రాయవచ్చని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. "రవాణా శాఖలో లింగసమానత్వం తీసుకురావడానికి ఇదో భారీ ముందడుగు. ఈ మార్పును ఈ ఏప్రిల్ నుంచే అమలు చేయాలని మేము ప్లాన్ చేస్తున్నాం" అని ఓ సీనియర్ రవాణా శాఖాధికారి తెలిపారు. కొత్త మార్పులకు తగ్గట్టుగా ప్రస్తుత సాఫ్ట్‌వేర్‌‌ను మారుస్తున్నామని, ఈ వారానికల్లా ఇది పూర్తి కావొచ్చని ఆయన చెప్పారు. కాగా, ఢిల్లీలో మొత్తం 13 ప్రాంతీయ రవాణా కార్యాలయాలు (ఆర్‌టీఓ) ఉన్నాయి. రాజధానిలో ప్రతి పనిదినాన దాదాపు 1600 డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేస్తున్నారు.

More Telugu News