britain: ఆన్ లైన్లో పోర్న్ వీడియోలు చూడాలనుకుంటే వయసు నిరూపించుకోవాల్సిందే...! బ్రిటన్ సర్కారు కొత్త నిబంధన

  • 18 ఏళ్లు నిండిన వారికే ఆ అవకాశం
  • తాము మేజర్లమని నిరూపించుకోవాల్సిందే
  • త్వరలోనే కొత్త విధానం అమల్లోకి వచ్చే అవకాశం

బ్రిటన్ సర్కారు ఓ కొత్త పథకాన్ని తీసుకొస్తోంది. ఆన్ లైన్ లో పోర్నో గ్రఫీ వీడియోలను వీక్షించే వారి వివరాలు తీసుకునే యోచనతో ఉంది. యూజర్లు ఆన్ లైన్ లో ఆ తరహా వీడియోలను చూడాలనుకుంటే ముందు తమకు 18 ఏళ్లు నిండినట్టు వయసు ధ్రువీకరణ వివరాలను ప్రభుత్వ విభాగానికి అందించాలి. 18 ఏళ్లు పూర్తయినట్టు రుజువు అయితేనే అక్కడి నుంచి ఆమోదముద్ర పడుతుంది. ఆ తర్వాతే ఆన్ లైన్ లో పోర్న్ వీడియోలను చూసే అవకాశం లభిస్తుంది. ఎందుకంటే ఆన్ లైన్ లో స్వేచ్ఛగా ఆ వీడియోలు కనిపించకుండా ప్రభుత్వం వాటిని బ్లాక్ చేసేస్తుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త నిబంధన అమలు చేయాలన్నది సర్కారు యోచన. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. 

More Telugu News