Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్ లోకి విదేశీయులను అనుమతించిన భారత్... చైనాకు షాక్!

  • నిషేధిత ప్రాంతాల్లోకీ అనుమతి
  • కేంద్ర హోంశాఖ నిర్ణయం
  • తవాంగ్ వ్యాలీ, జిరో తదితర ప్రాంతాలకు డిమాండ్

అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మారుమూల అందాలను వీక్షించేందుకు విదేశీయులను అనుమతించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగం అంటూ ఇంతకాలం భారత్ పై ఒత్తిడి తీసుకొస్తున్న చైనాకు పరోక్షంగా భారత్ తన నిర్ణయంతో షాకిచ్చినట్టయింది. అంతర్గత మంత్రిత్వ శాఖల సమన్వయ కమిటీ సమావేశం అనంతరం కేంద్రం ఈ నిర్ణయానికి వచ్చింది. ఐదేళ్ల కాలపరిమితితో నిషేధిత ప్రాంత అనుమతులను మంజూరు చేయనుంది. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ వ్యాలీ, జిరో, బోమ్ డిలా భౌగోళికంగా పర్వతాల మధ్య ఎంతో అందంగా ఉండే ప్రాంతాలు. అయితే, ఇప్పటి వరకు ఉన్న ఆంక్షల నేపథ్యంలో సమీప ప్రాంతాలు, సరిహద్దు రాష్ట్రాల వరకు వచ్చిన పర్యాటకులకు ఇక్కడ పర్యటించే అవకాశం లభించడం లేదు. దీంతో మరింత మంది పర్యాటకులు అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటించేందుకు వీలుగా నిబంధనలు సడలించాలని కేంద్ర పర్యాటక శాఖ కోరగా, దానికి ఆమోదముద్ర పడింది. సానుకూల నిర్ణయం తీసుకోవడంపై కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి కేజే ఆల్ఫోన్స్ హర్షం వ్యక్తం చేశారు.

More Telugu News