usa: చైనాతో వాణిజ్య యుద్ధానికైనా సిద్ధమే... భయపడం కానీ...: అమెరికా

  • మా ఉద్దేశ్యం అది కాదు
  • ఆమోదయోగ్యమైన టారిఫ్ లపై చర్చలు జరుగుతున్నాయి
  • ఏం చేయాలో, ఎలా చేయాలో తెలుసునన్న అమెరికా

చైనాతో వాణిజ్య యుద్ధం గురించి తమకు భయమేమీ లేదని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్టీవెన్ ముచిన్ అన్నారు. అయితే, తమ ఉద్దేశ్యం అది కాదన్నారు. ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని, ఇరు దేశాలకు ఆమోదయోగ్యమైన టారిఫ్ విధానం, మార్కెట్లను తెరవడం, బలవంతపు టెక్నాలజీ బదిలీలపై ఓ అంగీకారాన్ని ఆశిస్తున్నట్టు చెప్పారు. చర్చల్లో భాగంగా కొన్ని చర్యలు అవసరమని, ట్రంప్ అదే చేస్తున్నారని పేర్కొన్నారు. చైనా ఉత్పత్తులపై భారీ సుంకాలు విధిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయంతో మార్కెట్లపై పెద్దగా ప్రభావం ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు. ఎలా చేయాలి, ఏం చేయాలన్న విషయంలో చాలా జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నట్టు చెప్పారు. చైనాతో వాణిజ్య లోటు 370 బిలియన్ డాలర్లకు చేరిపోవడంతో ఆ దేశం నుంచి తమ దేశంలోకి దిగుమతి అవుతున్న అన్ని ఉత్పత్తులపై అమెరికా గట్టి చర్యలతో సమాధానం ఇచ్చిన విషయం తెలిసిందే.

More Telugu News