వేములవాడ రాజన్న టెంపుల్లో ట్రాన్స్జండర్ల సందడి....శివుడితో పెళ్లయినట్లు ప్రకటన...!

- శ్రీరామనవమి పర్వదినాన వేములవాడ రాజన్న టెంపుల్కు తండోపతండాలుగా తరలివచ్చిన భక్తులు
- వధువుల మాదిరిగా అలంకరించుకున్న ట్రాన్స్జండర్లు
- సీతారాముల వారికి పట్టువస్త్రాల సమర్పణ..శివుడితో పెళ్లయినట్లు ప్రకటన
ఈ ఏడాది కూడా సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కనులారా తిలకించి తరించేందుకు శనివారం రాత్రి నుంచే తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచే కాక కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన భక్తులు కూడా తండోపతండాలుగా తరలివచ్చారు. భక్తులు తొలుత ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. శివుడిని పెళ్లి చేసుకునేందుకు జోగినులు వధువుల మాదిరిగా అలంకరణ చేసుకున్నారు. చేతిలో త్రిశూలం ధరించారు. ఈ వివాహ వేడుకను ఆలయ ప్రధాన అర్చకుడు గోపన్నగరి శంకరయ్య పర్యవేక్షించారు. ఆలయ ఈఓ డి.రాజేశ్వర్ దంపతులు, నగర పంచాయతీ ఛైర్పర్శన్ నామాల ఉమతో పాటు ట్రాన్స్జండర్లు కూడా సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పించారు.