Mukesh Ambani: తెలంగాణలో అంబానీ విశ్వవిద్యాలయం!

  • అసెంబ్లీ ముందుకు రానున్న ప్రైవేటు యూనివర్శిటీల బిల్లు
  • ఆమోదించేందుకు సిద్ధమైన కేసీఆర్ సర్కారు
  • ఇప్పటికే ఏపీ, మహారాష్ట్రల్లో ప్రైవేటు విశ్వవిద్యాలయాలు

తెలంగాణ రాష్ట్రంలో కేజీ నుంచీ పీజీ వరకూ విద్యను అందించేలా ఓ పెద్ద యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అత్యంత కీకలమైన ప్రైవేటు యూనివర్శిటీల బిల్లు అసెంబ్లీ ముందుకు ఈ సమావేశాల్లోనే రానుండగా, ఈ బిల్లు అమలులోకి వస్తే, విద్యా రంగంలో సంస్కరణలు అమలవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రైవేటు వర్శిటీలను పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఆమోదించగా పలు విద్యాసంస్థలు యూనివర్శిటీల స్థాపనకు ముందుకు వచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ ఇదే తరహా చట్టం తేవాలని గత సంవత్సరమే కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించి, ముసాయిదాను సిద్ధం చేసింది. అయితే, పలు వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఈ బిల్లు అసెంబ్లీలో చర్చకు రాలేదు. ముఖ్యంగా ప్రైవేటు వర్శిటీల్లో రిజర్వేషన్ల అమలుపై నెలకొన్న మీమాంస బిల్లుకు ప్రధాన అడ్డంకిగా మారింది. ఇక రిజర్వేషన్లపై స్వల్ప సవరణలతో ప్రైవేటు సంస్థలకు పక్క రాష్ట్రాల్లో అనుమతులు ఇచ్చినట్టే తెలంగాణలోనూ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. రేపు ఈ బిల్లు అసెంబ్లీ ముందుకు రావచ్చని సమాచారం.

More Telugu News