world earth hour: దేశమంతటా ఒక గంట పాటు చీకటి... 'ఎర్త్ అవర్' పాటించిన భారత్!

  • నిన్న రాత్రి గంట పాటు ఆగిపోయిన లైట్లు
  • ఢిల్లీలో రాష్ట్రపతి భవన్, ఇండియాగేట్, పార్లమెంట్ కాంప్లెక్స్ లో ఇదే పరిస్థితి
  • హైదరాబాద్ లో బుద్ధుడి విగ్రహం, హౌరా బ్రిడ్జిపైనా లైట్లు ఆఫ్

పర్యావరణ పరిరక్షణ పట్ల స్పృహ కల్పించేందుకు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న వరల్డ్ ఎర్త్ అవర్ కార్యక్రమంలో భారత్ కూడా పాలుపంచుకుంది. శనివారం రాత్రి దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఒక గంట పాటు లైట్లను స్వచ్చందంగా ఆపేసి మద్దతు పలికారు. ఢిల్లీలో పార్లమెంట్ కాంప్లెక్స్, శాస్త్రి భవన్ లో రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు చీకటి రాజ్యమేలింది.

రాష్ట్రపతి భవన్, ఇండియాగేట్, అక్షరధామ్ టెంపుల్, హైదరాబాద్ లోని బుద్ధుడి విగ్రహం, కోల్ కతాలోని హౌరా బ్రిడ్జ్ లో గంట పాటు లైట్లు ఆగిపోయినట్టు వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ సంస్థ ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తోంది ఈ సంస్థే. ప్రజలు అందరూ స్వచ్చందంగా ఓ గంట పాటు అవసరం లేని లైట్లను ఆఫ్ చేసి ప్రపంచ ఎర్త్ అవర్ కార్యక్రమానికి సంఘీభావం తెలియజేయాలని అంతకుముందే కేంద్ర మంత్రి హర్షవర్ధన్ పిలుపునిచ్చారు. చాలా మంది నేతలు, సెలబ్రిటీలు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు.

More Telugu News