airtel 4g data free: మీరు ఎయిర్ టెల్ కస్టమర్లా... అయితే మీకు 4జీ వోల్టే 30 జీబీ డేటా ఫ్రీ!

  • మూడు దశల్లో 10జీబీ చొప్పున డేటా
  • రూపాయి చెల్లించాల్సిన పనిలేదు
  • కాకపోతే సాంకేతిక సమస్యలపై ఫీడ్ బ్యాక్ ఇవ్వాలి

ఎయిర్ టెల్ కస్టమర్లకు శుభవార్త. ఈ సంస్థ 4జీ వోల్టే సర్వీసులను అధికారికంగా ప్రారంభించే సన్నాహాల్లో ఉంది. దీనికంటే ముందు సాంకేతిక సన్నద్ధత, లోపాల గుర్తింపునకు గాను 4జీ వోల్టే బీటా సేవలను దేశవ్యాప్తంగా కొన్ని సర్కిళ్లలో ఆరంభించింది. ‘ఉచితంగా డేటా వినియోగించుకోండి... మా టెక్నాలజీ ఎలా ఉందో పరీక్షించి అభిప్రాయాలు చెప్పండి’ అంటూ ఈ సంస్థ ఆహ్వానం పలుకుతోంది.

ఆంధ్రప్రదేశ్, కేరళ, ఒడిశా, పశ్చిమబెంగాల్, అసోం, బిహార్, పంజాబ్ సర్కిళ్లలో ఎయిర్ టెల్ వోల్టే బీటా కార్యక్రమం అందుబాటులో ఉంది. ఉచిత డేటా ప్యాకేజీలో భాగంగా యూజర్లు 30జీబీ వరకు యాక్సెస్ చేసుకోవచ్చు. ఇందులో 10జీబీ డౌన్ లోడింగ్ కు తొలుత అవకాశం ఇస్తుంది. నాలుగు వారాల వినియోగం తర్వాత ఫీడ్ బ్యాక్ తీసుకుంటుంది. అనంతరం మరో 10జీబీ డేటా ఉచితంగా ఇస్తుంది. ఆ తర్వాత మరో నాలుగు వారాలు గడిచిన అనంతరం ఫీడ్ బ్యాక్ తీసుకుని చివరిగా 10 జీబీ డేటా ఇస్తుంది. నెట్ వర్క్ పరంగా ఎదుర్కొనే సమస్యలపై యూజర్లు ఎప్పటికప్పుడు తెలియజేయాల్సి ఉంటుంది.

More Telugu News