apple iphone foldable: రెడీగా ఉండండి... మడిచి పెట్టుకునే ఫోన్లు వస్తున్నాయ్

  • అభివృద్ధిపై దృష్టి పెట్టిన స్మార్ట్ ఫోన్ల దిగ్గజం
  • ఆసియా భాగస్వాములతో చర్చలు
  • బ్యాంకు ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ సంస్థ వెల్లడి

యాపిల్ నుంచి భవిష్యత్తులో ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ చూసే అవకాశం కలగనుంది. 2020 నాటికి ఇది మార్కెట్లోకి వస్తుందంటూ తాజా అంచనాలు వినిపిస్తున్నాయి. యాపిల్ ఫోల్డబుల్ ఐ ఫోన్ పై దృష్టి పెట్టిందని సమాచారం. ఆసియాకు చెందిన భాగస్వాములతో కలసి ఫోల్డబుల్ ఐఫోన్ ను అభివృద్ధి చేసే పనిలో యాపిల్ ఉందని బ్యాంకు ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ అనే సంస్థ స్వయంగా తెలిపింది.

ఈ మేరకు తన క్లయింట్లకు యాపిల్ సంస్థ భవిష్యత్తుపై పరిశోధన కథనం (యాపిల్ అమెరికాలో లిస్టెడ్ కంపెనీ) అందించింది. ఫోల్డబుల్ ఐఫోన్ కు సంబంధించి సరఫరాదారులతో యాపిల్ చర్చిస్తున్నట్టు తమకు సంకేతాలు ఉన్నాయని అందులో తెలిపింది. ఫోల్డబుల్ ఓఎల్ఈడీ ప్యానళ్లను వాడనున్నట్టు, 2020 నుంచి ఉత్పత్తి ప్రారంభమవుతుందని అంచనా వేసింది. శామ్ సంగ్, లెనోవో సంస్థలు సైతం ఫోల్డబుల్ ఫోన్లను తీసుకొచ్చే ఆలోచనతో ఉన్నాయి. ఇప్పటికే ప్రయోగాలు కూడా నిర్వహించాయి.

More Telugu News