KTR: ఈసారి కేటీఆర్ వంతు.. కేంద్రంపై ఫైర్

  • రాష్ట్రానికి కేంద్రం చేసిందేమీ లేదు
  • టీఆర్ఎస్ ప్రభుత్వ చర్యలతోనే రాష్ట్రంలో ఐటీ విస్తరణ
  • బడా పారిశ్రామికవేత్తలు కోట్లు కొల్లగొట్టి పారిపోతున్నారు

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ప్రాంతీయ పార్టీల విమర్శలు నానాటికీ ఎక్కువవుతున్నాయి. తాజాగా కేంద్రంపై టీఆర్ఎస్ మరోసారి విరుచుకుపడింది. కేంద్ర ప్రభుత్వానివి మాటలే తప్ప, చేతలేం లేవని తెలంగాణ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఐటీఐఆర్, పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రం ఇచ్చిందేమీ లేదని ఆయన విమర్శించారు. కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేకున్నప్పటికీ... ఐటీ విస్తరణకు తామే చర్యలు చేపట్టామని తెలిపారు.

రాష్ట్రంలో పారిశ్రామికీకరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని అన్నారు. దేశంలో ఐటీ విస్తరణ జాతీయ సగటు 9 శాతం ఉంటే... తెలంగాణలో 14 శాతంగా ఉందని తెలిపారు. ఫలితంగా 1.2 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. పెద్దపెద్ద కంపెనీలు, బడా వ్యాపారవేత్తలు వేల కోట్లు కొల్లగొట్టి దేశం విడిచి పారిపోతుంటే... కేంద్రం మౌనంగా ఉందని కేటీఆర్ విమర్శించారు. ఇదే సమయంలో చిన్న పారిశ్రామికవేత్తలను, ప్రజలను ఇబ్బంది పెడుతుందని తెలిపారు.  

More Telugu News