YSRCP: అమిత్ షా లేఖతో ఆశ్చర్యపోయా: వైసీపీ చీఫ్ జగన్

  • హోదాతో ఏపీకి పరిశ్రమలు వచ్చి ఉండేవి
  • బోలెడన్ని రాయితీలు వచ్చేవి
  • ప్రత్యేక ప్యాకేజీ తన ఘనతేనన్నచంద్రబాబు నేడు యూటర్న్ తీసుకున్నారు

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాసిన లేఖలోని అంశాలు తనను ఆశ్చర్యానికి గురిచేసినట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. షా లేఖపై ఇప్పటికే చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ నిప్పులు చెరగ్గా తాజాగా జగన్ స్పందించారు.

ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. హోదాకు ఏదీ సాటి రాదనీ, హోదా వచ్చి ఉంటే ఏపీకి పలు పరిశ్రమలు వచ్చి ఉండేవని, జీఎస్టీ మినహాయింపు, విద్యుత్ చార్జీల్లో రాయితీ ఉండేవన్నారు. ప్యాకేజీ పేరుతో మోసం వద్దని, హోదా తమ హక్కు అని, అది లేకుంటే బతకలేమని అన్నారు. రెండేళ్ల క్రితం ప్రత్యేక ప్యాకేజీ తన ఘనతేనని ప్రకటించుకున్న చంద్రబాబు రెండేళ్ల తర్వాత యూ టర్న్ తీసుకున్నారని జగన్ ఎద్దేవా చేశారు.

More Telugu News