Yuvraj Singh: కొత్త హెయిర్ స్టైల్‌తో ఐపీఎల్ ఫైట్‌కు సిద్ధమవుతోన్న యువరాజ్ సింగ్

  • ఐపీఎల్ కోసం కోహ్లీ, ధోనీ తరహాలో కొత్త లుక్‌తో 'పంజాబ్ షేర్'
  • టీమిండియా యువ సంచలనం కేఎల్ రాహుల్‌కి సారీ..!
  • ఏప్రిల్ 7 నుంచి ప్రారంభంకానున్న మెగా టోర్నీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా టోర్నీ క్రికెట్ అభిమానులను దాదాపు ఒకటిన్నర నెల పాటు ఉర్రూతలూగించేందుకు సిద్ధమవుతోంది. ఈ ధనాధన్ టోర్నీకి ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ప్లేయర్లు కూడా డిఫెరెంట్ లుక్‌తో మైదానంలో కనువిందు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ సారథి విరాట్ కోహ్లీ, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ డిఫరెంట్ హెయిర్ స్టైల్‌ చేయించుకున్నారు. ఈ జాబితాలోకి ఇప్పుడు 'పంజాబ్ షేర్' యువరాజ్ సింగ్ కూడా వచ్చి చేరాడు.

ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్‌ను యువీ ఆశ్రయించాడు. తన స్నేహితురాలు అంగద్ బేడీ బలవంతం మేరకు ఈ కొత్త హెయిర్ స్టైల్ చేయించుకున్నానని అతను తెలిపాడు. ఇక టీమిండియా యువ సంచలనం కేఎల్ రాహుల్‌ హెయిర్ స్టైల్‌ని కాపీ కొట్టినందుకు అతనికి యువీ సారీ చెప్పాడు. తన కొత్త కేశాలంకరణకు సంబంధించిన చిత్రాలను సామాజిక మాధ్యమాల ద్వారా యువీ పంచుకున్నాడు.


ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో యువరాజ్ సింగ్ తన సొంత జట్టయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున మరోసారి ఆడనున్నాడు. గతేడాది అతను హైదరాబాద్ జట్టు కోసం ఆడిన సంగతి తెలిసిందే. కాగా, జనవరిలో నిర్వహించిన ఐపీఎల్ వేలం పాటలో పంజాబ్ ఫ్రాంచైజీ యువీని రూ.2 కోట్లను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 7 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభమవుతుంది.

More Telugu News