ఉత్కంఠను రేకెత్తిస్తోన్న 'కాశి' ట్రైలర్

24-03-2018 Sat 16:13
  • విజయ్ ఆంటోని హీరోగా 'కాశి' 
  • ఒక కథానాయికగా అంజలి 
  • ఏప్రిల్లో భారీ స్థాయిలో విడుదల  
విజయ్ ఆంటోని తమిళంలో తాను చేసిన సినిమాలు తెలుగులోనూ విడుదలయ్యేలా చూసుకుంటూ ఉంటాడు. తమిళంలో ఆయన తాజా చిత్రంగా 'కాళి' సినిమా రూపొందింది. తెలుగులో ఈ సినిమాకి ఆయన 'కాశి' అనే టైటిల్ ను ఖరారు చేశాడు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన తెలుగు వెర్షన్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

విదేశాల్లో వున్న హీరో .. తనకి తరచూ వస్తోన్న ఒక కల గురించి తెలుసుకోవడానికి గాను, ఇండియాలోని తన సొంత వూరికి బయల్దేరడంతో ట్రైలర్ మొదలవుతోంది. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. సస్పెన్స్ తో కూడిన సీన్స్ పై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా వుంది. తల్లితో ముడిపడిన ఎమోషనల్ సాంగ్ .. రొమాంటిక్ సాంగ్ మనసుకు హత్తుకునేవిలా వున్నాయి. అంజలి కూడా ఓ కథానాయికగా కనిపిస్తోన్న ఈ సినిమా, ఏప్రిల్లో విడుదల కానుంది. చూస్తుంటే విజయ్ ఆంటోనికి ఈ సినిమా హిట్ తెచ్చిపెట్టేదిలానే వుంది.