Chandrababu: ఇవ్వాల్సింది కూడా ఇవ్వకుంటే న్యాయం చేసినట్లు ఎలా అవుతుంది?: చంద్రబాబు నిలదీత

  • ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎం మంజూరు చేశామని చెబుతున్నారు
  • నాలుగేళ్లలో రూ.11,672 రావాల్సి ఉంటే రూ.576 కోట్లు మాత్రమే ఇచ్చారు
  • ఏయే రాష్ట్రాల్లో రహదార్లకు ఎంతెంత ఖర్చు పెడుతున్నారో చర్చిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి
  • ఆర్థికంగా బలోపేతంగా ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఇంతగా ఎందుకు అడుగుతాం?

ఆంధ్రప్రదేశ్‌కి సాయం చేస్తూనే ఉన్నామని కేంద్ర ప్రభుత్వం అంటోందని, ఇవ్వాల్సింది కూడా ఇవ్వకుంటే న్యాయం చేసినట్లు ఎలా అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో నిలదీశారు. ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎం మంజూరు చేశామని చెబుతున్నారని, అయితే ఈ నాలుగేళ్లలో రూ.11,672 రావాల్సి ఉంటే రూ.576 కోట్లు మాత్రమే ఇచ్చారని అన్నారు. చెన్నై-విశాఖపట్నం కారిడార్ కోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని, ఎన్‌ఐసీడీఐటీలో కలిపితే మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పామని అన్నారు. వాటిపై కూడా అశ్రద్ధ చేశారని అన్నారు.

రాష్ట్రంలో కొత్త రహదారులు కేటాయించామని మాట్లాడుతున్నారని, ఏయే రాష్ట్రాల్లో రహదార్లకు ఎంతెంత ఖర్చు పెడుతున్నారో చర్చిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏపీ ఆర్థికంగా బలోపేతంగా ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఇంతగా ఎందుకు అడుగుతామని ప్రశ్నించారు. ఆంధ్ర ప్రజలను అవమానపర్చే విధంగా మాట్లాడడం సరికాదని అన్నారు.  

More Telugu News