Rahul Gandhi: దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసింది ఈ రెండే: రాహుల్ గాంధీ

  • నోట్ల రద్దు, జీఎస్టీలతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది
  • నీరవ్ మోదీ 22 వేల కోట్లతో ఉడాయించాడు
  • అదే డబ్బుతో ఎన్నో వ్యాపారాలు చేసి ఉండవచ్చు

మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీలతో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని, నిరుద్యోగాన్ని మరింత పెంచిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. మైసూరులో కాలేజీ విద్యార్థులతో ముచ్చటిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. డీమానిటైజేషన్ ను కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఓ పిచ్చి పనిగా కొట్టిపారేశారని గుర్తు చేశారు.

నీరవ్ మోదీ రూ. 22 వేల కోట్ల బ్యాంకు డబ్బుతో విదేశాలకు ఉడాయించాడని... ఆ మొత్తాన్ని మీకు ఇస్తే ఎన్నో రకాల వ్యాపారాలు చేసేవారని విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందని చెప్పారు. నైపుణ్యం ఉన్న వారికి ఆర్థిక స్తోమత లేకపోవడం, సహకారం లేకపోవడమే దీనికి కారణమని తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ నేడు విద్యార్థులతో భేటీ అయ్యారు. 

More Telugu News