Chandrababu: మనకు రావాల్సింది అడిగితే ఎదురుదాడి చేస్తున్నారు: చంద్రబాబు

  • ప్రత్యేక హోదాకు 14వ ఆర్థిక సంఘం ఒప్పుకోలేదని చెప్పారు
  • హోదాతో సమానంగా ప్యాకేజీ ఇస్తామన్నారు
  • పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలని కోరాం
  • విభజన చట్టంలో పెట్టినవి ఎందుకు ఇవ్వరని ఇక్కడి నుంచి అడుగుతున్నాను

'కేంద్ర ప్ర‌భుత్వ తీరు ఎలా ఉందంటే.. క‌ష్టం మ‌నది.. అంటే మ‌న‌ ద‌గ్గ‌ర ట్యాక్సుల రూపంలో తీసుకుంటున్నారు.మ‌న‌కి క‌ష్టాలు ఉన్న‌ప్పుడు డ‌బ్బులు మాత్రం ఇవ్వ‌రు.. ట్యాక్సులు మాత్రం వ‌సూలు చేసుకుంటారు' అని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్నారు. ఈ రోజు ఆయ‌న శాస‌న‌స‌భ‌లో మాట్లాడుతూ... ఈఏపీ ఇస్తామ‌ని చెప్పారు కానీ ఒక్క పైసా కూడా ఇవ్వ‌లేదని అన్నారు. ప్రత్యేక హోదాకు 14వ ఆర్థిక సంఘం ఒప్పుకోలేదని చెప్పారని, హోదాతో సమానంగా ప్యాకేజీ ఇస్తామన్నారని అన్నారు. అది కూడా స‌రిగ్గా అమ‌లు చేయడం లేద‌ని అన్నారు.

రాష్ట్ర హ‌క్కుల‌పై కేంద్ర మంత్రుల‌కు చాలా లేఖ‌లు రాశామ‌ని, పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలని కోరామ‌ని చంద్రబాబు నాయుడు అన్నారు. విభజన చట్టంలో పెట్టినవి ఎందుకు ఇవ్వరని ఇక్కడి నుంచి తాను మ‌రోసారి అడుగుతున్నానని అన్నారు. మ‌న‌కు రావాల్సినవి మన‌ము అడుగుతుంటే ఎదురుదాడి చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

More Telugu News